అంబాజీపేట

Posted by Nagesh G

అంబాజీపేట మండలం తూర్పు గోదావరి జిల్లా లోని గ్రామం. అంబాజీపేట కొబ్బరికాయ లకు ప్రసిద్ది. అంబాజీపేట కొబ్బరి కాయలు అంటే చుట్టు పక్కల అన్ని గ్రామాల్లో మిక్కిలి మక్కువ.

అంబాజీపేట అందాల సీమ కోనసీమలో వుంది. కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది.

ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంసృతీ సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అతిది, అభ్యాగతులను ఆధరించడం, పందుగలను సాంప్రదాయానుసారం నిర్వహించడం ఇక్కడ గమనించవచ్చు.

నీటి కొబ్బరి, ఎండు కొబ్బరి, కొబ్బరి పీచు, కొబ్బరి నూనెకు కోనసీమలో అంబాజీపేట మార్కెట్ కే పెట్టిందిపేరు. ఇక్కడ "కోకోనెట్ రేసెర్చ్ ఫొరుం" కూడా వుంది. ఇక్కడ నుండి వచ్చిన "గోదావరి గంగ" కొబ్బరి బొండాం అందరికీ సుపరిచితమే.